Breaking News విద్య

బండి తూకానికి రెడీ

41 Views

గ్రామాలలో రోజురోజుకు పశు సంపద తగ్గడం తో పాటు, ఎడ్ల బండ్లు సైతం మూలకు పడుతున్నాయి. వ్యవసాయ పనులకు, దున్నుకాలకు ట్రాక్టర్ లనే వాడుతున్నారు. కాగా సోమవారం దౌల్తాబాద్ మండల పరిధిలోని హైమద్ నగర్ పత్తి మిల్లు వద్ద కనిపించిన ఓ దృశ్యం అందరిని ఆశ్చర్యపరిచింది. శౌరీపూర్ గ్రామానికి చెందిన నక్క బిక్షపతి అనే రైతు తన చేనులో పండించిన పత్తి విక్రాయించడానికి ఎడ్ల బండి పై తీసుకు వచ్చి, ధర్మ కాంట పై తూకం వేయడానికి తీసుకురావడంతో అక్కడ వున్నవారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గ్రామాలలో పశుసంపద ఉన్న రోజులను గుర్తు చేసుకొని ఆనాటి గుర్తులను అక్కడి రైతులు చర్చించుకోవడం కనిపించింది.

Oplus_131072
Oplus_131072
Manne Ganesh Dubbaka