*బంధు స్కీములు కాదు.. భవిష్యత్ కావాలి.,*
*బహుజన రాజ్యంతోనే బడుగుల బతుకుల్లో మార్పు.*
నక్క విజయ్ కుమార్. బహుజన్ సమాజ్ పార్టీ ధర్మపురి నియోజకవర్గ ఇంచార్జి నక్క విజయ్ కుమార్, మండల అధ్యక్షులు కల్లెపెల్లి తిరుపతి, మండల నాయకులు విల్సన్, అర్జున్ ల ఆధ్వర్యంలో గొల్లపల్లి మండలం రాపల్లి గ్రామంలో చేపట్టిన మూడవ రోజు గడప గడపకు గజరాజు కార్యక్రమంలో భాగంగా ఆయా పార్టీలల్లో పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలు డాక్టర్ ఆరెస్ ప్రవీణ్ కుమార్ గారి ఆలోచన, పనివిధానం నచ్చి పెద్దఎత్తున బహుజన్ సమజ్ పార్టీలో చేరారు. వారందరికీ విజయ్ కుమార్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ గతంలో ప్రవీణ్ కుమార్ గారు గురుకులాల సెక్రటరీగా ఉన్నప్పుడు తాను బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మరియు అగ్రవర్ణాల్లో ఉన్న పేద పిల్లలకు తను చేసిన సేవలు ఎంతో గొప్పవని, తినడానికి తిండిలేని నిరుపేద బిడ్డలను అమెరికా లండన్ లాంటి గొప్పగొప్ప దేశాలకు ఉన్నత విద్యాకోసం పంపించడం జరిగింది. కేవలం ఒక ప్రభుత్వ ఉద్యోగిగా తొమ్మిది సంవత్సరాల కాలంలోనే నిరుపేద విద్యార్థులకు అంత మేలు చేయగలిగితే.., నిజంగా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే బడుగు బలహీన అట్టాడుగు వర్గాల్లో పేదరికం అనేదే లేకుండా చేస్తాడని కొనియాడారు.
ఆధిపత్య పార్టీల నాయకులు ఎలక్షన్ రాగానే రావడం.. మీకు పింఛను, రైతు బంధు, దళిత బంధు, బిసి బంధులంటూ ఆశలు చూపి మా అభివృద్ధిని బొందబెట్టి, మా ఓట్లను దండుకొని పోవడం రివాజుగా మారిందన్నారు. మెజారిటీ ప్రజలైన నిరుపేదల జీవితాలను మార్చుటకు ఇంతవరకు ఏ ఆధిపత్య పార్టీ కూడా చిత్తశుద్ధితో ఒక నిర్ధిష్టమైన కార్యాచరణ రూపొందించలేదని వాపోయారు. పేద వర్గాల ప్రజలను సంపన్న వర్గాలుగా తీర్చిదిద్దె దూరదృష్టి కలిగిన నాయకుడు ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో పనిచేయడం మాకు సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్బంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ బలహీన వర్గాల అభివృద్ధికై ఎస్సీ కార్పొరేషన్ నిధులను మరియు బీసీ సబ్ ప్లాన్ నిధులను కనీసం 20% కూడా ఈ ప్రభుత్వం ఖర్చు చెయ్యకుండా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల నిధులనన్నింటిని పాలకులు దోచుకొని ఫామ్ ఫార్మ్ హౌజులు కట్టుకొని వాళ్ళు మాత్రమే అపార కుభేరులు అవుతున్నారని పాలకులపై మండి పడ్డారు. మనకు బంధులు కాదు మన పిల్లల బ్రతుకులు మార్చే, మంచి భవిష్యత్తునిచ్చే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ పాఠశాలలు కావాలి. ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అంతేకానీ బడుగు బలహీనులను బర్రెలు కాసుకో, గొర్రెలు కాసుకో అని ప్రలోభపెట్టడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఈ రాష్ట్రంలో 12 శాతం జనాభా ఉన్న యాదవులకు తగిన విధంగా ఎమ్మెల్యే టికెట్లు కేటాయించక పోవడాన్ని తీవ్రంగా ఖండించారు. జరుగుతున్న మోసాన్ని విజయ్ కుమార్ మాటలలో తెలుసుకున్న గ్రామ ప్రజలు రానున్న రోజుల్లో బిఎస్పీ పార్టీ ఏనుగు గుర్తుకు ఓట్లేసి భారీ మెజారిటీతో ధర్మపురి గడ్డపై నీలి జెండాను ఎగరవేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బుగ్గారం మండల అధ్యక్షులు గజ్జెల స్వామి మరియు గ్రామస్తులు చిర్ర దుబ్బరాజం, మారంపల్లి మల్లయ్య, కనుక శ్రీనివాస్, గజ్జల దుబ్బయ్య, మారంపల్లి శ్రీనివాస్, మారంపల్లి ఉదయ్ కుమార్, కనుక నవీన్, నక్క గంగరాజు, మారంపల్లి రమేష్, మారంపల్లి పోచయ్య, మారంపల్లి రాజేష్, మారంపల్లి రాజు, మారంపల్లి అభి, గడుగు పాల్, మారంపల్లి విక్రం, కనుక రమణ, మారంపల్లి మధు, కుంటాల రమేష్, రేగుంట కార్తీక్, మారంపల్లి సంతోష్, గడుగు దినేష్, కొండపల్లి రవితేజ, మారంపల్లి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.





