రాహుల్గాంధీ సభకు తరలిన ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ నాయకులు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నుండి శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు వరంగల్ రాహుల్ గాంధీ సభ కు తరలి వెళ్ళినట్లు ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల పోరాటం చేస్తుందని అన్నారు మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన నాయకులు కార్యకర్తలు ఈ సభకు తరలివెళ్లడం జరిగిందన్నారు.




