ప్రాంతీయం

గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిని కలిసిన ఆర్యవైశ్య మహాసభ నేతలు 

42 Views

 

 

జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూoకుంట నర్సారెడ్డిని గురువారం గజ్వేల్ ఆర్యవైశ్య మహాసభ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన జగ్గయ్యగారి శేఖర్ గుప్త, గజ్వేల్ పట్టణ శాఖ అధ్యక్షులుగా ఎన్నికైన అత్తెల్లి శ్రీనివాస్ గుప్తలకు ఆయన శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు. అనంతరం పట్టణ శివారులో నిర్మిస్తున్న ఆర్యవైశ్య కళ్యాణ మండపం, శ్రీ కమలం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ నిర్మాణాలను ఆయన పరిశీలించారు. ఆర్యవైశ్యుల అభ్యున్నతికి తన వంతు సంపూర్ణ సహకారం ఉంటుందని ఈ సందర్భంగా నర్సారెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా ధర్మబద్ధమైన వ్యాపారాలు నిర్వహించే ఆర్యవైశ్యులు సామాజిక, సేవా కార్యక్రమాల్లో సైతం ముందుంటుంటడ హర్షనీయమని ప్రశంసించారు. ఈ కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ డైరెక్టర్ మహంకాళి శ్రీనివాస్ గుప్త, మండల ఎంపీపీ మాజీ ఉపాధ్యక్షులు లక్ష్మయ్య గుప్త, కిరాణా వర్తక సంఘం అధ్యక్షులు సిద్ధి బిక్షపతి గుప్త, శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప క్షేత్ర అధ్యక్షులు శ్రీనివాస్ గుప్త, మహాసభ నేతలు సూర ఆంజనేయులు గుప్త, మల్యాల భద్రయ్య గుప్త, అయితే సత్యం గుప్త, కొండపాక శ్రీనివాస్ గుప్త, తేరాల రాజు గుప్త, ఉమేష్ గుప్త, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జహీర్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Prabha