ద్విచక్ర వాహన దారులకు హెల్మెట్ ధరించడం పైన అవగాహన కార్యక్రమం.
సిద్దిపేట జిల్లా, తెలుగు న్యూస్ 24/7
జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను పురస్కరించుకుని శనివారం సిద్దిపేట జిల్లా రవాణా శాఖ అధికారుల ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన దారులకు హెల్మెట్ ధరించడం పైన అవగాహన కార్యక్రమం నిర్వహించడం తోపాటు హెల్మెట్ పెట్టుకుని బైక్ ర్యాలీ డీటీఓ కార్యాలయం నుండి నర్సాపూర్ క్రాస్ రోడ్ వరకు నిర్వహించడం జరిగింది. వేములవడ కామన్ రోడ్ దగ్గర హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహన దారులకు జరిమానా విధిస్తూ, రోడ్ భద్రత కు సంబంధించి అవగాన పత్రాలను కూడా పంపిణీ చేయడం జరిగింది .ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు తప్పకుండా పాటించాలి అని ప్లకార్డ్ లు ప్రదర్శిస్తూ స్కూల్ పిల్లలతో సిద్దిపేట పాత బస్ స్టాండ్ నుండి విక్టరీ టాకీస్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. సిద్దిపేట మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శంకర్,
రాయణ,మాట్లాడుతూ,ప్రతి వాహనదారుడు తప్పకుండా రోడ్డు నిబంధనలు పాటిస్తూ సిద్దిపేట జిల్లాని ప్రమాద రహిత జిల్లాగా మార్చుదామని పేర్కొన్నారు.ప్రతి ద్వి చక్ర వాహనదారుడు విధిగా హెల్మెట్ ధరించాలని తద్వారా అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే తలకు గాయం కక్కుండా కాపాడుతుందని చెప్పారు.వాహనదారులతో రహదారి భద్రత ప్రమాణం చేయించడం జరిగింది.ఈ మాసోత్సవల్లో ఎంవీఐ శంకర్ నారాయణ ,ఏఎంవిఐ శ్రీకాంత్ రెడ్డి, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ రవీందర్,హోమ్ గార్డ్స్ అష్రఫ్,వెంకటేష్, రామేశ్వర్ పాల్గొన్నారు.





