Breaking News

బహుజనుల ఏకికరణతోనె రాజ్యాంగ రక్షణ – బాంసెఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బట్డి చెన్నయ్య

271 Views

బహుజనుల ఏకికరణతోనే భారత రాజ్యాంగాన్ని రక్షించుకొగలమని
భాంసెఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బట్టి చెన్నయ్య అన్నారు.
ఆదివారంనాడు గజ్వేల్ అంబేద్కర్ సర్కిల్ లో బాంసెఫ్ మహసభల పొస్టర్ ను విడుదల చేశారు. ఈసందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మారుస్తామన్న బిజెపిని ఎన్నికలలో ప్రజలు కట్టడి చెసి తగిన బుద్ది చెప్పారన్నారు. ఓబిసిల కులాధిరిత జనగణన చేయకపోవడం రాజ్యాంగం కల్పించిన హక్కులను అధికారాలను ఉల్లంఘించడమేనన్నారు. సెప్టెంబరు 1వ తేదిన బాంసెఫ్ 11వ తెలంగాణ రాష్ట్ర మహసభలను సంగారెడ్డి అంబేద్కర్ భవన్ లో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ మహాసభలో ఈవిఎం లను నిషెధించి బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు జరపాలని,బిసి జనగణణన,ప్రవేటికరణ తదితర అంశాల పై చర్చించి భవిష్యత్తు కార్యచరణను రూపొందిస్తామని చెన్నయ్య తెలిపారు. ఈ మహసభలను బహుజన మూల వాసులు విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. డిబిఎఫ్ జాతీయ కార్యద్శి పి.శంకర్ మాట్లడుతూ ఇటివల రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల పై లాకప్ హింస పెరిగిపొతున్నాయన్నారు. లాకప్ హింసకు పాల్పెడుతున్న పొలీసుల పై ఎస్సీ,ఎస్టి అట్రాసిటి కేసులు నమోదు చెయలన్నారు.ఈ కార్యక్రమంలో దళిత ఉద్యోగుల ఐక్య వేదిక పి.ఎల్లయ్య,దమ్మని మల్లయ్య,డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పులి కల్పన, సామాజిక కార్యకర్త మహ్మద్ సుల్తాన,మైనార్టి నాయకులు కాశీం, డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఎగొండ స్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణుతదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found