ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సత్తా…
ఎల్లారెడ్డిపేట్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 405 మంది విద్యార్థులు
పరీక్షలు రాయగా 386 మంది ఉత్తీర్ణత సాధించి 95 శాతం ఉత్తీర్ణత సాధించడం జరిగింది. జడ్పీహెచ్ఎస్ ఎచ్ దుమాల విద్యార్థిని ఆర్.అర్పిత 574 మార్కులతో మండల మొదటి ర్యాంకు, జడ్పీహెచ్ఎస్ గొల్లపల్లి విద్యార్థిని పి.ప్రణవి 564 మార్కులతో రెండవ ర్యాంకు, జడ్పీహెచ్ఎస్ బొప్పాపూర్ విద్యార్థినిలు పి.రిషిక,ఆర్ శ్రీవర్షిణి 562 మార్కులతో మూడవ ర్యాంకు, జడ్పీహెచ్ఎస్ తిమ్మాపూర్ విద్యార్థిని ఎన్.నాగవర్షిణి, జడ్పీహెచ్ఎస్. వెంకటాపూర్ విద్యార్థిని ఎస్.సురేఖ 559 మార్కులతో నాల్గవ ర్యాంకు సాధించారు.మండలంలో టాపర్లుగా అమ్మాయిలు ముందంజలో ఉండటం గమనర్హం.మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు 118 మంది 500కి పైగా మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలల సత్తా చూపించడం జరిగింది.
