రాఖీ పౌర్ణమి సందర్బంగా రామకోటి రామరాజు తన అక్కకోసం కంటికి కనిపించని అరుదైన చిన్న పదిపైసలు (1988) నాటి నాణాలు సేకరించి వెయ్యికి పైగా ఉపయోగించి 10అడుగుల భారీ రాఖీ చిత్రాన్ని అద్భుతంగా రూపొందించి రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి తన అక్కకు అంకితమిచ్చారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. ఈ సందర్బంగా మాట్లాడుతూ అన్న చెల్లెలు, అక్క తమ్ముడు జరుపుకునే మహాత్తరమైన పండుగన్నారు. మా అక్క జ్ఞాపకాలు నాలో పదిల పర్చుకొని నాలో ఉన్న కళకు పదును పెట్టి మా అక్క రాఖీ కట్టిన చేతితోనే ఈ అద్భుత రాఖీ చిత్రాన్ని రూపొందించి మా అక్క సంధ్యారాణికి అంకితమిచ్చానని తెలిపాడు. తను లేకపోయినా తన జ్ఞాపకలు మనసులో పదిలంగా దాచుకున్నానని రామకోటి రామరాజు తెలిపారు.
