సిద్దిపేట జిల్లా టార్గెట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెలక్షన్స్ లో దక్కన్ పబ్లిక్ స్కూల్ గౌరారం కి చెందిన విద్యార్థులు సబ్ జూనియర్ బాలికల విభాగంలో అనూష , శ్రీ జన్య , శాలిని, వైష్ణవి ,హారిక , నూతన, భభిత, బాలుర విభాగంలో చరణ్, అజయ్ ,సాకేత్, ధనుష్ రెడ్డి , అనిరుద్ , మహేష్, ధీరజ్ లు ఎంపిక కావడం జరిగింది. వీరు ఈ నెల 19 , 20 తేదీలలో హైదరాబాద్ లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని దక్కన్ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ మహమ్మద్ రఫ్ ఖాన్ , స్కూల్ అడ్మినిస్ట్రేషన్ మహమ్మద్ రుక్సానా, ప్రిన్సిపల్ మహమ్మద్ అజీమ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలలో మంచి ప్రతిభ కనబరిచి సిద్దిపేట జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని వారు కోరారు. క్రీడాకారులను తీర్చిదిద్దినటువంటి పీఈటీలు సందీప్.కిరణ్ ఇరువురిని పాఠశాల తరఫున ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.
