రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుశాఖ వారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కార్యక్రమం జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే గారి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నట్లు గంభీరావుపేట ఎస్సై మహేష్ తెలిపారు. మండలంలో పదవతరగతి ,ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులై ఆసక్తి గల యువతి, యువకులు గంభీరావుపేట పోలీస్ స్టేషన్ లో పూర్తి వివరాలతో 25-11-2022 శుక్రవారం రోజు లోగా పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ జాబ్ మేళాకి సుమారుగా 100 కంపెనీలు రానున్నాయని అన్నారు. గంభీరావుపేట మండలంలోని నిరుద్యోగ యువతి, యువకులకు ఇది ఒక సువర్ణావకాశంగా భావించి , దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై కోరారు. జాబ్ మేళా నిర్వహించే తేదీ, ప్రదేశం మరొక్క ప్రకటనలో తెలియజేస్తామని తెలిపారు
