(తిమ్మాపూర్ అక్టోబర్ 07)
తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామానికి చెందన నాంపల్లి రవిశంకర్ సిఎస్ఎస్పి బెటాలియన్ కానిస్టేబుల్ గా సెలక్ట్ అయినా సందర్బంగా రవిశంకర్ ను అభినందించిన అల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు పారునంది జలపతి, గ్రామ సర్పంచ్ మేడి అంజయ్య .
ఈ సందర్భంగా సర్పంచ్ మేడి అంజయ్య, గ్రామస్తులతో కలిసి రవిశంకర్ ను శాలువాతో ఘనంగా సన్మానించి,డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని బహూకరించారు.
అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ..
ఎంతో కష్టపడి చదివి నేడు కానిస్టేబుల్ గా ఎన్నిక అవడం నిజంగా అభినందనీయయం అన్నారు. ఇదే విధంగా మరింత కష్టపడి చదివి ఉన్నత స్థాయి ఉద్యోగం పొంది గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు నార్ల అశోక్, బీనపల్లి మాధవి- శ్రీనివాస్, నాయకులు ఎడ్ల తిరుపతి రెడ్డి,గొల్ల గణేష్,బౌత్ గంగాధర్,కామెర సంపత్,బుర్ర శ్రీనివాస్,సానకొండ చంద్రయ్య,నాంపల్లి శ్రీనివాస్,జంగ శ్రీనివాస్,నాంపల్లి మల్లయ్య, మొగిలిపాలెం అంజయ్య,ఎండి రఫీ, నాంపల్లి వేణు,కొలిపాక ఓదెలు,ఎండి అహ్మద్,కామేర భూమలింగు,నాంపల్లి ప్రవీణ్,గుంటి నవీన్ తదితరులు పాల్గొన్నారు_.




