ప్రాంతీయం

వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

107 Views

దౌల్తాబాద్: తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాల వల్ల ఉమ్మడి మెదక్ జిల్లాలో మంజీరా నది పరివాహక ప్రాంతాల్లోని పంట పొలాలలో నీరు చేరి ఇసుకమేటలు మట్టితో పొలాలన్నీ కూడా వ్యవసాయ భూములు నిండిపోయి రైతన్నకు కష్టాలని మిగిల్చిందని మెదక్ పార్లమెంటు టిడిపి అధ్యక్షులు ఇల్లెందుల రమేష్ ఒక ప్రకటన లో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగం త్వరితగతిన నష్టపోయిన పంటలను సందర్శించి ప్రభుత్వానికి నివేదించి నష్టపరిహారం అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుందని తెలిపారు.రైతులకు సబ్సిడీ ఎరువులు యూరియా పొటాషియం అదేవిధంగా వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీని ఇచ్చి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని అదేవిధంగా తక్షణమే రైతులకు రుణమాఫీ చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *