ప్రాంతీయం

బెజ్జంకి మండలాన్ని తిరిగి కరీంనగర్ జిల్లాలో కలపాలి 

127 Views

బెజ్జంకి మండలాన్ని తిరిగి కరీంనగర్ జిల్లాలో కలపాలి

గుగ్గిళ్ళ గ్రామ కార్యదర్శి, సర్పంచ్ వినతి పత్రం అందజేసిన

గుగ్గిళ్ళ బిజెపి నాయకులు

సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 2, తెలుగు న్యూస్ 24/7

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలాన్నీ తిరిగి కరీంనగర్ జిల్లాలో బెజ్జంకి మండలాన్ని చేర్చాలని గుగ్గిళ్ల గ్రామ బిజెపి గ్రామ శాఖ అధ్యక్షులు తుమ్మ రాజు, బూత్ అధ్యక్షులు చెప్యాల సాయిరాం గ్రామ బీజేపీ నాయకులతో కలిసి గుగ్గిళ్ళ గ్రామపంచాయతీ కార్యదర్శి వంశీధర్,గుగ్గిళ్ళ గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ళ మల్లయ్యకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ గత ప్రభుత్వంలో  స్వార్థ రాజకీయాల కోసం జిల్లాను విడదీసారని, ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండానే విడదీసారని తిరిగి బెజ్జంకి మండలానికి కరీంనగర్ జిల్లాల్లో కొనసాగించేందుకు కృషి చేయాలని గ్రామ పంచాయితీ కార్యలయంలో కార్యదర్శి, సర్పంచ్ కి గుగ్గిళ్ళ గ్రామ బిజెపి పక్షాన వినతిపత్రం అందజేసి, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ మంత్రులు ఎమ్మెల్యేలు చొరవ తీసుకొని బెజ్జంకి మండలాన్ని కరీంనగర్ జిల్లాలో కలిపేందుకు కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి గ్రామ శాఖ అధ్యక్షులు తుమ్మరాజు,చెప్యాల సాయిరాం,పోలవేణి వెంకటేష్, కొత్తూరి శీను, పందిళ్ళ రమేష్, పోతురాజు, దుగ్యాని మోహన్ గ్రామ బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *