-ఇద్దరికి తీవ్ర గాయాలు
(తిమ్మాపూర్ ఏప్రిల్ 30)
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలో ప్రమాదం చోటు చేసుకుంది. పోలంపల్లి గ్రామనికి చెందిన మిల్లర్ కూలీలు ఇంటి స్లాబ్ వేసేందుకు మిల్లర్ యంత్రంతో వెళ్తున్నారు.. బెజ్జంకి మండలం దేవక్కపల్లి గ్రామంలో స్లాబ్ వేసి వస్తుండగా తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామ శివారులో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికులు 108 సహాయంతో క్షతగాత్రులను కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ట్రాక్టర్ డ్రైవర్ అ జాగ్రత్తగా నడపడంతో ఈ ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు.