మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో ఈ సోమవారం భరతదేశ ప్రథమ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకొని బాలల దినోత్సవం సందర్బంగా చందాయిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రామ సర్పంచ్ బుడ్డా స్వర్ణలత భాగ్యరాజ్ అధ్యక్షతన బాలల గ్రామసభ నిర్వహించి బాల బాలికల యొక్క సమస్యలు తెలుసు కోవడానికి గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్, ఉప సర్పంచ్ కొండూరి సంతోష్ కుమార్, పంచాయతీ కార్యదర్శి కృష్ణ విద్యార్థులు పాల్గొనడం జరిగింది.
