ముస్తాబాద్, మార్చి 26 (24/7న్యూస్ ప్రతినిధి): తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)2024 కి సంబదించిన ఫీజులను పెంచడం పేద నిరుద్యోగ అభ్యర్థులకు అన్యాయం చేయడమేనని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ్ అన్నారు. వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన టెట్ నోటిఫికేషన్ ఈనెల 27నుండి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానున్న సందర్భంలో ఈ సారి అప్లికేషన్ ఫీజులు భారీగా పెంచడంతో నిరుద్యోగుల పైన ఫీజుభారం మోపడమే అవుతుందని మండిపడ్డారు. టెట్ పరీక్ష ఫీజు గత ప్రభుత్వంలో 2021లో 200 రూపాయలు 2022లో 300 రూపాయలు గత ఏడాదిలో రెండు పేపర్లు గాను 400 రూపాయలు ఈ సంవత్సరం నోటిఫికేషన్ లో ఒక పేపర్ కి దరఖాస్తు చేసుకుంటే వెయ్యి రెండు పేపర్లు కి దరఖాస్తు చేసుకుంటే రెండు వేల రూపాయలు చెల్లించాల్సి వస్తోందని ఒకే సారి ఫీజు పెంచడం కారణంగా అభ్యర్థులు అనేక రకాలుగా ఆర్థిక సమస్యలతో గురి అవుతారని అన్నారు. ప్రభుత్వం నిరుద్యోగుల పైన అప్లికేషన్ల పేరుతో వసూలు చేస్తున్నారు. ఇలాంటి వైఖరి సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోటీ పరీక్షలకు ఎలాంటి అప్లికేషన్ ఫీజులు వసూలు చేయమని ఎన్నికలలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ అప్లికేషన్ల ఫీజు పేరుతో భారీగా వసూలు చేయడం సిగ్గుచేటని నిరుద్యోగ యువతకు అన్యాయం చేయడమే అని అన్నారు. ప్రజా ప్రభుత్వం అంటే ఇదేనా అని ఫీజుల పేరుతో నిరుద్యోగుల పైన బారం మోపడమెన ?ఫీజులు 150 శాతం నుండి300 శాతం టెట్ పరీక్ష ఫీజుల పెంపు పై ప్రభుత్వం పునరాలోచన చేయాలని పెంచిన ఫీజులు తగ్గించాలి అని డిమాండ్ చేస్తున్నామని పేర్నోన్నారు.లేని పక్షంలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని నిరుద్యోగుల ఆగ్రహానికి గురి కాక తప్పదు అని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టే శ్రీనివాస్ నాయకులు నవీన్. పోతర్ల వంశీ. గౌరు రాకేష్ . సూర రంజిత్.కందుకూరి విజయ్. కొడం వెంకటేష్. నరేష్. అషూ. ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
48 Viewsమంచిర్యాల జిల్లా. మందమర్రి లో B1 పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మందమర్రి పట్టణంలోని B1 పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యాలయాన్ని చెన్నూర్ శాసనసభ్యులు డా. జి. వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి ఈ కార్యాలయం ఉపయోగపడుతుందని అన్నారు.ప్రజల మధ్య ఉన్నత రాజకీయ విధానాలను తీసుకురావాలనే లక్ష్యంతో B1 పార్టీ ముందుకు సాగుతుందని తెలిపారు.మందమర్రి ప్రాంత అభివృద్ధి, […]
65 Viewsసిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం ఇటిక్యాల గ్రామంలో బుధవారం గ్రామ తాజా మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బత్తిని బాలయ్య గౌడ్ హైమావతి కుమార్తె స్వేత వివాహానికి,అలాగే కీర్తిశేషులు కంటి బిక్షపతి లక్ష్మి కుమార్తె ప్రవళిక వివాహానికి పుస్తె మట్టెలు అందజేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ రావి కంటి చంద్రశేఖర్ సేవలు అభినందనీయమని ఒకే రోజు ఇద్దరు పెళ్లికూతుర్లకు రెండు జతల పుస్తే మట్టెలు అందజేయడం గొప్ప విషయం అని గ్రామంలో అందరికి […]
62 Views జూలై 2న నిర్వహించే డేమోలు రద్దు చెయ్యాలి. మంచిర్యాల జిల్లా జూలై 1 మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళశాలలో జులై 2న అతిధి అధ్యాపకుల డేమోలు వెంటనే రద్దు చెయ్యాలని కోరుతూ మంచిర్యాల జిల్లా ప్రభుత్వ డిగ్రీ ఐడి కళశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చక్రపాణి కి వినతిపత్రం అందజేశారు. గతంలో బెల్లంపల్లి ప్రిన్సిపాల్ పై అనేక ఆరోపణలు వచ్చాయని, విచారణ సమయంలో అతిథి అధ్యాపకుల విషయంలో ప్రిన్సిపాల్ డాక్టర్ టీ.ఎస్ […]