రాయపోల్ మండల పరిధిలోని ప్రాథమిక పాఠశాల వడ్డేపల్లిలో స్వయం పరిపాలన దినోత్సవం, చిల్డ్రన్స్ డే సందర్భంగా ప్రాథమిక పాఠశాల వడ్డేపల్లిలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఇఓగా ఫిరోజ్ ఖాన్, ఎంఈఓగా హారిక, ప్రధానోపాధ్యాయురాలుగా శ్రీజ వ్యవహరించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి బోధన చేపట్టారు. అదే విధంగా పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బేగంపేట కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు హాజరయ్యారు. పాఠశాల ఉపాధ్యాయులు వేణు, విద్యాసాగర్, జీనత్, శిరీష, సోనీలు తదితరులు పాల్గొన్నారు.
