(తిమ్మాపూర్ మే 06)
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ, సుభాష్ నగర్ స్టేజి వద్ద దావు మధురమ్మ జ్ఞాపకార్థం రామకృష్ణ కాలనీ గ్రామ రెడ్డి సంఘం అధ్యక్షుడు దావు సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం మండల నాయకులతో కలిసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. రాజీవ్ రహదారిపై నిత్యం వేల సంఖ్యలో రోడ్డుపై ప్రయాణిస్తూ ఉంటారు. ఎండాకాలం కావడంతో గ్రామస్తులు ప్రయాణికులు,కళాశాలల విద్యార్థుల దాహం తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాచర్ల అంజయ్యగౌడ్ , దావు శ్రీనివాస్ రెడ్డి, అంజిరెడ్డి, సిరి కొండా వెంకట్రావ్, కొమ్మెర మల్లారెడ్డి,ప్రభాకర్ రెడ్డి,వేల్పుల ఓదెలు, గంగు నరేష్, అలు వాలా కుమార్,సంపత్,గణేష్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.




