ప్రమాదకర కల్వర్టును పరిశీలించిన ఉపసర్పంచ్,పీఆర్ఏఈ . ఎల్లారెడ్డిపేట మండలకేంద్రం నుండి కోరుట్లపేట వెళ్లే మార్గమధ్యంలో ప్రమాదకరంగా మారిన కల్వర్టు ను స్థానిక ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ పిఆర్ఏఈ సాయి తో కలిసి పరిశీలించారు.ఇటీవల వరుసగా కురిసే వర్షాల కారణంగా బ్రిడ్జి కోతకు గురై ప్రమాదకరంగా మారింది.దీంతో ఇట్టి మార్గం గుండా వెళ్లే ప్రయాణీకులు అజాగ్రత్తగా వెళ్తే ప్రమాదం జరిగే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రమాదాల నివారణ కోసం తీసుకోవలసిన నిర్మాణం కోసం అంచనాలు రూపొందించాలని ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ పంచాయితీరాజ్ ఏ ఈ సాయి ని కోరారు
