రాయికల్ మండలంలో ఘనంగా రంజాన్ వేడుకలను నిర్వహించిన ముస్లిం సోదరులు. పవిత్రమైన రంజాన్ పర్వదిన సందర్భంగా గురువారం రాయికల్ లోని ఈద్గా వద్ద జరిగిన రంజాన్ పండుగ ప్రత్యేక ప్రార్థనలో ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మాట్లాడుతూ, రంజాన్ పండుగ ప్రతి ముస్లిం కుటుంబంలో వెలుగు నింపాలని ఆకాంక్షించారు. అనంతరం ముస్లిం సోదరులు ఒకరికొకరు శుభాకాంక్షలుతెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ అధ్యక్షులు సోహైల్, మతపెద్దలు సద్దాం సహబ్ మహెబూబ్ సహాబ్,రహీమ్ సాహబ్ నబి సబ్, మహమ్మద్ షకీల్,ముహమ్మద్ ఆన్సర్ అలీ,నాజీం సహాభ్ ,నయీం సహభ్,ముస్తాక్ అహ్మద్ మున్ను,సభీర్,ముస్లిం పెద్దలు మసీదు పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




