ప్రకటనలు ప్రాంతీయం

చేనేత జౌళి శాఖ కమిషనర్ సిరిసిల్ల జేఏసీ కమిటీ నాయకులతో సమావేశం

154 Views

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం , సమస్యలను పరిష్కరించి ఉపాధి కల్పించాలని సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఐక్యవేదిక జేఏసీ ఏర్పాటు చేసి నేతన్న గర్జన సభ , ఆందోళన పోరాటాలు చేసిన ఫలితంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సిరిసిల్ల జేఏసీ నాయకులతో సమావేశం అయి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం వల్ల జేఏసీ పోరాటాన్ని విరమించి పనులు ప్రారంభిస్తున్నమని ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ జెఏసి నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశం సందర్భంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న పూర్తి సమస్యలను,సమస్యలు పరిష్కారం కోసం సలహాలు సూచనలను అందించడంలో భాగంగా చేనేత జౌళి శాఖ డైరెక్టర్ తో సమావేశం ఏర్పాటు చేయిస్తామని చెప్పిన మాట ప్రకారం నిన్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఐక్యవేదిక జేఏసీ కమిటీతో హైదరాబాదులోని సచివాలయంలో చేనేత జౌళి శాఖ డైరెక్టర్ అలుగు వర్షిని మేడం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ స్థితిగతులు, సమస్యలు తెలియజేసి పరిష్కారం కొరకు సలహాలు,సూచనలు, విజ్ఞప్తులు చేయడం జరిగింది. మేడం దాదాపు 3 గంటల పాటు సమయం కేటాయించి జేఏసీ నాయకులు చెప్పిన సమస్యలు అన్నింటిని నోట్ చేసుకుని ప్రభుత్వం,మంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు ఆ తర్వాత జెఏసి కమిటీ నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్ ని కరీంనగర్ లో వారి ఇంటికి వెళ్లి కలిసి మేడం తో చెప్పిన సమస్యలను తెలియజేసి తొందరగా సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.ఈ సమావేశంలో జేఏసీ కన్వీనర్లు మూశం రమేష్ ,పంతం రవి, సభ్యులు కూరపాటి రమేష్, మండల సత్యం,మంచె శ్రీనివాస్, తాటిపాముల దామోదర్,గోలి వెంకటరమణ,యేల్దండి శంకర్, కోడం రమణ,సిరిసిల్ల రవీందర్, సిరిమల్లె సత్యం,కుమ్మరి కుంట కిషన్,వేముల దామోదర్,పిస్క మధు,కోడం అశోక్, గౌడ రాజు గోనె పర్షరాములు,ఏనుగుల ఎల్లయ్య,కొక్కుల వెంకటేశం , ఎల్డంది దేవదాస్,బండారి అశోక్, నక్క దేవదాస్,గుండు రమేష్, గోవిందు రవి తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7