ప్రకటనలు

ప్రభుత్వం మహాత్మ పూలేకు భారతరత్న ఇవ్వాలి

70 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం.సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడి,సమాజాన్ని మేల్కొల్పిన మహాత్మ జ్యోతిరావు పూలే కు భారతరత్న అవార్డు ప్రధానం చేయాలని దళిత సంఘం జిల్లా నాయకులు ఏడపల్లి బాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ఏడపల్లి బాబు మాట్లాడుతూ…. సంఘసంస్కరణలకు పిత మహుడిగా నిలిచిన పూలే కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారని, నిమ్న కులాలు,మహిళల హక్కుల కోసం ఉద్యమించారని తెలిపారు.విద్య ప్రాముఖ్యతను పూలే ఆనాడే గుర్తించారని,ఆనాటి సమాజంలో విద్యకు నోచుకోని బాలికలను చేరదీసి, వారికి విద్యాభ్యాసం చేసి,బాధ్యతలను ఆయన భార్య సావిత్రిబాయికి అప్పజెప్పారని గుర్తు చేశారు.దళితుల్లో అంటరానితనానికి గురవుతున్న మహర్లు,మాతంగి కులస్తులకు బాలికల కోసం పాఠశాలలు నిర్వహించాలని, వితంతు వివాహాన్ని ప్రోత్సహించారని చెప్పారు.బ్రాహ్మణ వాదానికి మూఢభక్తికి వ్యతిరేకంగా పూలే పోరాడారని,బానిసత్వం,రైతులకు అధికారంపై విమర్శనాత్మక గ్రంథాలను రచించారని తెలిపారు.నిన్న కులాలపై అగ్రకుల ఆధిపత్యాన్ని దాడులను తన రచనల్లో ప్రస్తావించి,విగ్రహారాధనకు మూడ భక్తికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యాన్ని రగించారని పేర్కొన్నారు.

Oplus_131072
Oplus_131072
శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్