Breaking News ప్రకటనలు విద్య

విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో 25వ సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవం…

508 Views

విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో నేడే సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవం

సిరిసిల్ల శాసనసభ సభ్యులు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ రాకా
: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో బుధ , గురు వారం రెండు రోజుల పాటు జరిగే సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవ సాంస్కృతిక కార్యక్రమాలకు సిరిసిల్ల శాసన సభ్యులు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నట్లు విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ కరస్పాండెంట్ ఎండి లతీఫ్ తెలిపారు ,
ఈ సందర్భంగా కరస్పాండెంట్ ఎండి లతీఫ్ మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు అందుబాటులో పట్టణాలకు దీటుగా కార్పొరేట్ స్థాయి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నెలకొల్పి అందరి ఆదరాభిమానాలు చూరగొని 25 సంవత్సరాలు కావస్తున్న శుభ సందర్భంగా సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవాలను పురష్కరించుకుని పాఠశాల విద్యార్థులచే సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు ,
ఈ కార్యక్రమంలో నాస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు , జిల్లా కలెక్టర్ అన్రాగ్ జయంతి , జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ , జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్, ఎంపీపీ పిల్లి రేణుక కిషన్. <జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు ,మండల విద్యాశాఖాధికారి రఘుపతి , స్థానిక సర్పంచ్ నేవూరి వెంకట్రెడ్డి,స్థానిక ప్రజా ప్రతినిధులను , వివిధ పార్టీల నాయకులను , స్థానిక ప్రెస్ క్లబ్ ప్రతినిధులను , విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను ఆహ్వానిస్తున్నట్లు కరెస్పాండెంట్ లతీఫ్ తెలిపారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *