Breaking News నేరాలు ప్రకటనలు ప్రాంతీయం

ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఒకరి మృతి…

380 Views

ఎల్లారెడ్డిపేట లో విషాదం

ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఒకరి మృతి

ఎల్లారెడ్డిపేట జనవరి 19 :

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన పెంటం కుమార్ (30) అనే వ్యక్తి ద్విచక్ర వాహనం
అదుపు తప్పి గురువారం రాత్రి 10-00 గంటల ప్రాంతంలో అక్కడికక్కడే మరణించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు,
మరణించిన కుమార్ ను రాత్రి కావడంతో ఎవరు చూడకపోవడం శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించి అతని తండ్రి బెస్త పద్మయ్యకు సోదరుడు పెంటం ప్రవీన్ కు సమాచారం అందించారు,
వెంటనే అతని కుటుంబ సభ్యులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చూసి బోరున విలపిస్తున్నారు,
మృతుడికి భార్య సోని పిల్లలు చరణ్, వర్షిత్ ఉన్నారు.
మృతిని తండ్రి బెస్త పద్మయ్య పిర్యాదు మేరకు ఘటన స్థలానికి ఎల్లా
రెడ్డి పేట ఎస్ఐ ర మాకాంత్ చేరుకొని శవాన్ని పంచనామా చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *