24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 12)
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గజ్వేల్ ఫైర్ స్టేషన్లో హోంగార్డ్ గా విధులు నిర్వహిస్తున్న యాదగిరి ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా అగ్నిమాపక అధికారి పెమ్మన బోయిడి సురేష్ కుమార్ అధ్వర్యంలో గజ్వేల్ అగ్నిమాపక కేంద్రం ఉద్యోగులు ఆర్ధిక సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ రోజు తోటి ఉద్యోగులు రూ.50 వేల ఆర్థిక సాయం అందజేశారు.
