పదిలో అత్యుత్తమ ఫలితాలు సాధించాలి – విజ్ఞాన్ పాఠశాల కరస్పాండెంట్
లతీఫ్
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు శనివారం బాసరలోని సరస్వతి దేవాలయానికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ లతీఫ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జిల్లాలోనే అత్యధిక 10 జీపీఎ సాధించిన మా విజ్ఞాన్ పాఠశాల విద్యార్థులు ఈ సంవత్సరం కూడా అత్యుత్తమ ఫలితాలను సాధించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. పదవ తరగతి విద్యార్థులు ఎప్పుడూ చదువులో నిమగ్నమైనoదున మానసిక ఉల్లాసం తో పాటు చదువుల తల్లి సరస్వతి మాత దర్శనం కూడా అవుతుందని విద్యార్థులను బాసరకు తీసుకురావడం జరిగిందన్నారు. ఈనెల 18న పదవ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నందున మా విజ్ఞాన్ పాఠశాల విద్యార్థులు భయపడకుండా ఇష్టంగా రాయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రతి సంవత్సరం పాఠశాలకు, తల్లితండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకొస్తున్న పదవ తరగతి విద్యార్థులు ఈ సంవత్సరం కూడా అత్యుత్తమ ఫలితాలు సాధిస్తారని కరస్పాండెంట్ లతీఫ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శరత్ కుమార్, ఉపాధ్యాయులు కృష్ణ, సబితా, పిఈటి భరత్ కుమార్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
