
Your message has been sent
తెలుగు సాహిత్యంలో వివిధ ప్రక్రియలపై కృషి చేస్తున్నందుకుగాను, అదేవిధంగా బాలసాహిత్యంలో రచనా, పరిశోధన చేసినందుకుగాను డా. వాసరవేణి పర్శరాములు గారు “జాతీయ వాగ్దేవి పురస్కారం”కు ఎంపికైనట్లు తెలంగాణ వివేక రచయితల సంఘం జిల్లా కార్యదర్శి దుంపెన రమేష్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈసందర్భంగా తెవిరసం జిల్లా కార్యదర్శి దుంపెన రమేష్ మాట్లాడుతూ డా. వాసరవేణి పర్శరాములు తెలుగు సాహిత్యంలో ఎనలేని కృషి చేశారనీ, చుక్ చుక్ రైలు, చల్ చల్ గుర్రం, చిర్రగోనె, చెట్టిరుక, నారుమడి, మట్టిలో మాణిక్యం, చైతన్యమూర్తి, బతుకమ్మ, గొర్రెపిల్ల, పరశురామ బాలశతకం , నాన్న చెప్పిన కథలు, జానపద పిల్లల పాటలు, తంగెడు చెట్టు, దశాబ్ది బాలసాహిత్యం ఒక పరిశీలన, తెలంగాణ వ్యావహారికభాషా పదాలు, ఆకుఅలం, కర్రెద్దు, తెలంగాణ దీర్ఘ గేయ కవిత, ఓ స్వార్థ రాజకీయ నాయకుల్లారా!, మూఢ నమ్మకాలు, మొదలగు 20కి పైగా పుస్తకాలు రచించారనీ, బాలసాహిత్యంలో పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందారన్నారు. వీరి రచనలు ఇతర భాషల్లోని కి అనువాదం అయ్యాయనీ, అధ్యాపకుడిగా బోధన చేస్తున్నారనీ, 500లకు పైగా వ్యాసాలు రాయగా వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయనీ తెలిపారు.
సాహిత్యంలో కృషికిగాను జాతీయ తెలుగు సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో సెప్టెంబర్ 26న హైదరాబాద్లో అందజేస్తున్నట్లు అధ్యక్షుడు కేశరాజు రాంప్రసాద్ ప్రకటించారనీ దుంపెన రమేష్ తెలిపారు.
తెవిరసం రచయితలు జనపాల శంకరయ్య , దుంపెన రమేష్,ఇ.మహేందర్, బారా ధన్ రాజ్, గుండెల్లి నీలకంఠం , వాసరవేణి దేవరాజు, జి. తిరుపతి, తదితరులు హర్షం వ్యక్తం చేశారు.





