(మానకొండూర్ ఫిబ్రవరి )
కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గం చెంజర్ల గ్రామంలో యాదవ సంఘ భవనంలో ఏర్పాటుచేసిన గ్రంథాలయానికి
నక్క వెంకటమ్మ యాదవ్, నక్క యాదగిరి స్వామి యాదవ్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ద్వారా, ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడే వారికి అన్ని గ్రూప్స్ కాంపిటేషన్ పరీక్షలకు అవసరమయ్యే వివిధ రకాలైన పుస్తకాలను, రెండు బీరువాలను వితరణ చేశారు నక్క సోదరులు.
ఈ సందర్భంగా నక్క సోదరులు నక్క ఉమేష్ కుమార్ యాదవ్, నక్క శ్రీనివాస్ యాదవ్ లు మాట్లాడుతూ…. రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రభుత్వ ఉద్యోగాలు పడనున్నాయని వాటికి సన్నద్ధం కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని, ఈ నేపథ్యంలో ఆర్థిక స్తోమత లేని నిరుద్యోగులకు మేమిచ్చే పుస్తకాలు ఎంతో దోహద పడతాయని అన్నారు…ఆర్థిక స్థోమత లేక తెలివితేటలు ఉన్న నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాలు ఒదులుకుంటున్నారని, వారందరకి యాదవ సంఘం భవనంలో ఏర్పాటు ప్రతి పుస్తకం ఉపయోగపడుతుందన్నారు.
ఈ మధ్యనే హైదరాబాద్ లో మా ఫౌండేషన్ ద్వారా రాష్ట్ర స్థాయిలో 33 జిల్లాల విద్యార్థులకు సాంఘిక శాస్త్ర ప్రతిభా పాటవ పరీక్షలు నిర్వహించామని, గెలుపొందిన వారికి క్యాష్, అవార్డ్ తో సత్కరించామని, తద్వారా పేద విద్యార్థులకు కాస్త ఊతమిచ్చిన వారము అయ్యామని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగమే కరీంనగర్ కి అతిసమీపంలో ఉన్న చెంజర్ల గ్రామంలో అన్ని గ్రూప్స్ ఉద్యోగ కాంపిటీషన్ పుస్తకాలను ఇవ్వడం పట్ల మాకు మేము సంతోషిస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ పట్టణ యాదవ సొసైటీ అధ్యక్షులు నందబోయిన ప్రసాద్ యాదవ్, చేంజార్ల యాదవ సంగ అధ్యక్షులు గడ్డి గణేష్ యాదవ్ యాదవ సంఘం జిల్లా, మండల నాయకులు, సోషల్ టీచర్స్ ఫోరమ్ జిల్లా బాద్యులు, స్థానిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు, స్థానిక ఎంపీటీసీ, సర్పంచ్, తదితరులు పాల్గొన్నారు.