Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం విద్య

ఇంట్లో తండ్రి శవం. మరోవైపు తనయుడి కి పబ్లిక్ పరీక్ష…

125 Views
  • ఇంట్లో తండ్రి శవం. మరోవైపు  కుమారునికి పబ్లిక్ పరీక్ష

– బరువెక్కిన గుండెతో పరీక్ష రాసిన విద్యార్థి

– తద నంతరం దహన సంస్కరణలుమ

రణించిన తండ్రి శవం ఇంట్లో ఉండగా పదో తరగతి పరీక్ష రాయడానికి బరువెక్కిన గుండెతో తల్లడిల్లుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపించాడు. పదో  పరీక్ష ఆ విద్యార్థికి కఠిన పరీక్షగా మారి విద్యార్థిని కల్చివేసింది స్థానికులు చెప్పిన వివరాలకు ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎ ల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన పుట్టి రవి(45) ట్రాక్టర్ డ్రైవర్ అనారోగ్యంతో శనివారం రోజు ఆసుపత్రిలో చేరగా సోమవారం అర్ధరాత్రి మరణించాడు. మృతుని కొడుకు పుట్టి శ్రావణ్ అక్కపల్లి గ్రామంలో తన చిన్నమ్మ ఇంట్లో ఉంటూ పదో తరగతి చదువుతున్నాడు. సోమవారం రోజే పరీక్షలు ఉన్నందున ఇంట్లో తన తండ్రి శవాన్ని వదిలి పరీక్ష కేంద్రానికి వెళ్లే పరిస్థితి తనకి ఎదురయింది. బంధువులు, ఇరుగుపొరుగు వారు శ్రావణ్ కు పరీక్ష రాయాలని సూచించగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రంలో తొమ్మిది గంటలకు చేరుకొని దుఃఖాన్ని దిగమింగుకొని పరీక్ష రాసి తన స్వగ్రామంలో అంత్యక్రియలకు హాజరై తండ్రి శవానికి నిప్పు పెట్టాడు. ఈ విషాద ఘటనను చూసేందుకు గ్రామస్తులందరూ వచ్చి కన్నీరు మున్నీరయ్యారు. మృతునికి భార్య రేణుక, కుమారులు శ్రావణ్,సాజితులు ఉన్నారు. కాగా మృతదేహాన్ని ట్రాక్టర్ డ్రైవర్లు అందరూ కలిసి తలా ఇంత పోగు చేసి దహన సంస్కరణలను నిర్వహించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నారు.

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్