తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరిన యువకులు.
మంచిర్యాల జిల్లా.
నవంబర్ 1: తెలంగాణ రాష్ట్రంలో 90 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజల బతుకులు మారాలంటే ,తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి రావాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ అన్నారు, శనివారం రోజున భీమవరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ కొన్ని సామాజిక వర్గాలే రాజకీయ ఆధిపత్యాన్ని చెలాయిస్తూ మిగతా వర్గాలను అణగదొక్కుతున్నాయని, కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు చైతన్యవంతమై రాజ్యాధికారం దిశగా పోరాడాలని అన్నారు. భీమారం మండలానికి చెందిన పలువురు పార్టీలో చేరడంతో వారికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ, సోషల్ మీడియా కన్వీనర్ మహమ్మద్ లతీఫ్, పాకాల దినకర్, దీపక్, శ్రీపతి సాయికుమార్, పడాల శివతేజ, భీమారం మండల నాయకుల దెబ్బతి శంకర్, తగరం రాజకుమార్, పింగిలి గట్టయ్య, బండి రాజు, కాలువ మధుకర్, సయ్యద్ హకీమ్ పాషా, మీనుగు సతీష్, దండ వేన శ్రీకాంత్, మారం రమేష్ పాల్గొన్నారు.





