రాజకీయం

బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించిన జి.వి.ఆర్

184 Views

(మానకొండూర్ జనవరి 25)

కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం కేంద్రంలో గురువారం బిఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యా లయంలో జెడ్పి చైర్ పర్సన్ కనుమల్ల విజయతో కలిసి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జివి రామ కృష్ణారావు పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొ న్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

గత బుధవారం రోజున కరీంనగర్లో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్ సక్సెస్ కావడంతో, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గుండెల్లో దడ పుట్టి తొండి పెట్టి చర్చలు తప్పు దోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.

సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో కేటీఆర్
మాట్లాడుతూ కరీంనగర్ లో జరిగినటువంటి అభివృ ద్ధి పైన మాజీ ఎంపీ వినోద్ కుమార్ తో చర్చకు రమ్మని ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ కి సవాల్ చేస్తే, ఆ సవాల్ ను స్వీకరించాల్సింది పోయి, బండి సంజ య్ తొండి పెట్టి చర్చలు తప్పు దోవ పట్టించిండు, వినోద్ కుమార్ తో చర్చకు భయపడి, ఎందుకంటే బండి సంజయ్ కరీంనగర్ కు చేసిన అభివృద్ధి ఏమీ లేదు కాబట్టి వినోద్ కుమార్ లాంటి గొప్ప వ్యక్తి తోటి చర్చలో పాల్గొనలేనని గ్రహించి, వెటకారంగా కేటీఆర్ తోటి నీ ‘అయ్యను తీసుకురా చర్చకు ‘ అని చెప్పి ఒక సంస్కారహీనుడిలా మాట్లాడడం సిగ్గుచేడు, దీనిని టిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది అని పేర్కొన్నారు.

ఇద్దరిలో ఎవరు అభివృద్ధి చెసిండ్రో తేల్చుకుందాం అని చర్చకు రమ్మని గౌరవంగా బోయినిపల్లి వినోద్ కుమార్ తో చర్చకు రమ్మని కేటీఆర్ బండి సంజయ్ ని పిలవడం జరిగి నది. ఈ సవాల్ ను స్వీకరించే దమ్ము లేని బండి సంజయ్, పిరికిపందిలాగా తప్పించుకొని డొంక తిరుగుడు మాటలు మాట్లాడడం సిగ్గుచేటు. ప్రముఖ విద్యావేత్త, ఒక న్యాయవాది, ఎన్నో అంశాల పైన అనుభవం ఉన్నటువంటి నాయ కుడు వినోద్ కుమార్ అలాంటి వ్యక్తిని అద్దెకు తెచ్చు కున్న నాయకుడు అని చెప్పడం వారి అజ్ఞానానికి నిదర్శనం అన్నారు. వినోద్ కుమార్ నూటికి నూరు శాతం ఆయన కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి, గతంలో ఆయన ఎంపీగా ఉన్నప్పుడు హుజురాబాద్ నియోజకవర్గం లో కొన్ని మండలాలు కరీంనగర్ లో కూడా ఉన్న సంగతి మీకు తెలవదా, బోయిన్పల్లి వినోద్ కుమార్ పుట్టింది కరీంనగర్ జిల్లాలోని సంగతి మీకు తెలవదా, మరి నిజంగానే బోయిన్పల్లి వినోద్ కుమార్ అద్దెకు తెచ్చిన నాయకుడైతే మరీ మీ పార్టీలో ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ లు ఎక్కడ నిలబడ్డారో నీకు తెలవదా, కాబట్టి బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటది అని హెచ్చరించారు.

ఈ సమావేశంలో కరీంనగర్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ కనుమల విజయ,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణా రావు, జడ్పిటిసి తాళ్లపల్లి శేఖర్ గౌడ్, సర్పంచ్ పృధ్విరాజ్, సీనియర్ నాయకులు గడ్డం నాగరాజు, బిఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, నియోజకవర్గ అధికార ప్రతినిధి శాతరాజు యాదగిరి, శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Manne Ganesh Dubbaka constancy 9701820298

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *