నిరుపేదల కళ్ళల్లో వెలుగు నింపిన గర్మిల్ల లయన్స్ క్లబ్.
రేకుర్తి కంటి ఆసుపత్రి మరియు గరిమెళ్ళ లయన్స్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరము మంచిర్యాలలోని నారాయణ హై స్కూల్ లో ఈనెల నాలుగో తారీఖున నిర్వహించిన విషయం తెలిసిందే.
రెండు విడుతలుగా మొత్తం 46 మందికి రేకుర్తి కంటి ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా కంటి ఆపరేషన్లు నిర్వహించారు. ఆపరేషన్లు చేయించుకున్న వారు తిరిగి మంచిర్యాలకు వచ్చిన సందర్భముగా గరిమెళ్ళ లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ మోదుంపురం వెంకటేశ్వర్, డైరెక్టర్ లయన్ గాజుల ముఖేష్ గౌడ్ మరియు జోన్ చైర్ పర్సన్ లయన్ సద్దనపు రామచందర్ లు ఆపరేషన్ చేయించుకున్న వారిని ఆప్యాయతగా పలకరిస్తూ క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ గర్మిళ్ల లైన్స్ క్లబ్ ఇలాంటి ఉచిత నేత్ర వైద్య శిబిరాలను విస్తృతంగా మారుమూల ప్రాంతాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్వహిస్తామని తెలిపారు. క్లబ్ చేస్తున్న సేవలు అందరూ వినియోగించుకోవాలని తద్వారా జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని కోరారు. కంటి ఆపరేషన్ చేయించుకున్న వారికి పళ్ళను పంపిణీ చేశారు.
కంటి ఆపరేషన్ చేయించుకున్న వారు మాట్లాడుతూ గరిమెళ్ళ లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని, మనుమలను మనవరాలను కల్లారా చూసుకునే భాగ్యం కలిగిందని, మాలాంటి నిరుపేదల కళ్ళల్లో వెలుగు నింపాయని,మా జీవితాలను ఆనందమయం చేసుకోవడానికి తోడ్పడతాయని తెలుపుతూ గరిమెళ్ళ లయన్స్ క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు తెలియ జేశారు.
ఈ కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి లయన్ బల్లు శంకర్ లింగం, సభ్యులు లయన్ వేముల ప్రవీణ్, క్లబ్ ఐ క్యాంపు వాలంటీర్ శ్రీ. తిరుపతి,నారాయణ హై స్కూల్ పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి కవిత, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
