(మానకొండూర్ సెప్టెంబర్ 27)
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రానికి చెందిన కొండ్ర ప్రహర్ష (24) ఇటీవల మృతి చెందగా వార్త సేకరణలో భాగంగా వారి ఇంటికి వెళ్ళగా పలువురు జర్నలిస్టు లు అనాదలైన చిన్న పిల్లలను చూసి చలించి తమ వంతు సహాయంగా పిల్లలకు ఏదైనా తోచిన సహాయం అందించాలని ఆలోచన చేసి మృతురాలి కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని అందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఆత్మహత్యలు చేసుకొని ఇలా పిల్లలను అనాధలుగా చేయవద్దని అన్నారు. మృతురాలిది నిరుపేద కుటుంబం కావడంతో పిల్లలు శ్రేయస్సు కోరి దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సహాయం అందించాలని కోరారు..
ఈ కార్యక్రమంలో మానకొండూర్ నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు మహ్మద్ రహిమొద్దీన్ (BIG TV), కొంపెల్లి సతీష్ (NTV), లంక స్వామి(SAKSHI TV), కోరేపు అనిల్ (10TV),సిరిసిల్ల అనిల్(PRIME 9), కొమ్మెర రాజురెడ్డి(AMMA NEWS) పాల్గొన్నారు.




