కోనరావుపేట వాసి సుమన్ కి ఓయూ డాక్టరేట్..
న్యూస్/ రాజన్న సిరిసిల్ల జిల్లా
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన యాస.సుమన్ కు ఉస్మానియా యూనివర్శిటీ హిస్టరీ విభాగంలో పిహెచ్ డి డాక్టరేట్ ప్రకటించారు. తెలంగణ ప్రాంతంలోనీ మాలల సామాజిక ఆర్థిక జీవన విధానం మరియు చారిత్రక నేపద్యం – అనే అంశంపై ఓయూ ప్రొఫెసర్ కే. రామకృష్ణ పర్యవేక్షణలో చేసిన పరిశోధనకు గాను ఓయూ పరీక్షల విభాగం యాస. సుమన్ కు డాక్టరేట్ ప్రకటించింది. ఈ డాక్టరేట్ పట్టాను ఉస్మానియా యూనివర్శిటీ 83వ స్నాతకోత్సవ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ , ఓయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ , అడోబ్ సీఈఓ శంతాన్ నారాయణ్ చేతుల మీదుగా పి హెచ్ డి డాక్టరేట్ పట్టాను యాస.సుమన్ అందుకున్నారు.




