దౌల్తాబాద్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ ప్రభాకర్ అన్నారు. గురువారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉమ్మడి మెదక్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి జీవితంలో శారీరక దృఢత్వం అవసరమన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసం తో పాటు శారీరక దృఢత్వానికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడా స్ఫూర్తితో ఆడి స్నేహభావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కేత కనకరాజు, ప్రిన్సిపల్ శోభారాణి, పిడి లు వెంకట్ రెడ్డి, రాజన్న పీఈటీలు పాల్గొన్నారు….




