ముస్తాబాద్/ ప్రతినిది/ అక్టోబర్/14 గ్రామీణ ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్య వ్యవసాయ రుణగ్రస్థత దేశ వ్యవసాయాభివృద్ధిని కుంటుపరుస్తున్న సమస్య కూడా ఇదే గ్రామీణుల్లో చాలామంది ఆర్ధిక అవసరాల కోసం ఎక్కువగా అప్పులు చేస్తుంటారు. వీటితో కొంత భాగం కుటుంబ అవసరాలకు మిగిలినదాన్ని వ్యవసాయ పెట్టుబడికి వినియోగిస్తున్నారు. అనేక కారణాల వల్ల రైతులు ఆ అప్పులను తీర్చలేక రుణగ్రస్తులవుతున్నారు.
ఈపరిస్థితినే మనం గ్రామీణ రుణగ్రస్తత లేదా అప్పుల భారం అంటుంటాం. పేదరికం, వారసత్వంగా వచ్చిన అప్పులు, పెరిగిన వ్యవసాయ ఖర్చులు, వ్యవసాయ రంగ వెనుకబాటుతనం, తక్కువ దిగుబడి, భూమి కౌలు రేట్లు పెరగడం, మతపరమైన కట్టుబాట్లు, ఖర్చులు, వడ్డీ వ్యాపారుల మీద అధికంగా ఆధారపడడం, ఎందుకంటే రైతులు పంటలపై ఆధారపడి ఉండటంవల్ల ఆపంట చేతికొస్తే అప్పులు తీరుస్తానని ధైర్యం — కానీ అసలుకు ఎసరు పెడుతున్న పాడు రోగంవస్తే రైతు బతుకు అంతే.. ఇదేపరిస్థితి రాజన్న సిరిసిల్ల జిల్లా
తంగళ్ళపల్లి మండలం జిల్లల్లా గ్రామానికి చెందిన అబ్బాడి తిరుపతిరెడ్డి అనే రైతు వరిపంట చేతికి వచ్చే దశలో ఏదో పాడు రోగంవచ్చి వరిపంటను పీడిస్తు వరి కంకులు తెల్లబడి పోతుందని ఆవేదన వ్యక్తం చేశాడు ఎన్ని రకాల క్రిమిసంహారక మందులు పిచికారి చేసిన ఫలితంలేదు ఈకారణంగా తెచ్చిన అప్పులు ఎలాతీర్చాలి ఇప్పుడు నాకు ఏపార్టీ వచ్చి నన్ను కాపాడుతుంది అన్నదాతలకు నేనున్నా అని అన్ని పార్టీలు చెబుతాయి ఇలాంటి పరిస్థితులలో రైతులు ఎలా ఉన్నారు అని అడగరే దిక్కుతోచని పరిస్థితులు నెలకొన్నాయని తిరుపతిరెడ్డి అనే రైతు ఏడుస్తూ తన ఆవేదన వ్యక్తం చేశాడు.




