Breaking News

వర్గల్ మండల్:దాతల సహకారంతో తల్లిదండ్రులు లేని అమ్మాయి వివాహం…*

129 Views

దాతల సహకారంతో తల్లిదండ్రులు లేని అమ్మాయి వివాహం…*

-జిల్లా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివాహం.
– ముందుండి వివాహం చేసిన బాలల సంక్షేమ సమితి సభ్యులు దేశబోయిన నర్సింలు, బాలల పరిరక్షణ అధికారి రాజు…

తల్లిదండ్రులు లేని నా అనే వారు ఎవరు లేని నిరుపేద అమ్మాయికి దాతల సహకారంతో వివాహం చేసి ఒక ఇంటి ఇంటివారిని చేశారు. ఎవరూ లేని ఊరు పేరు కూడా తెలియని సాస మౌనిక-ఎండపల్లి నరసింహ నూతన వధూవరులకు వివాహం చేసి ఔన్నత్యాన్ని చాటుకున్నారు. మానవత్వం మరిచిపోతున్న నేటి కాలంలో అన్ని తానై వివాహం చేసి తల్లిదండ్రులు, మేనమామ లాగా పెళ్లి పెద్దగా నిలిచి మానవత్వం చాటుకున్నారు బాలల సంక్షేమ సమితి సభ్యులు దేశభయిన నర్సింలు, బాలల పరిరక్షణ అధికారి రాజు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి రాంగోపాల్ రెడ్డి సూచనలు, మానవతావాదులు దాతల సహకారంతో వివాహం జరిపించడం జరిగింది. మౌనిక-నరసింహ వివాహానికి ఎంతోమంది దాతలు సహకరించి వారి మానవత్వాన్ని చాటుకున్నారు. సహకరించిన వారిలో నాచారం లక్ష్మీనరసింహస్వామి దేవాలయ చైర్మన్ హనుమంతరావు  పుస్తె మట్టెలు,కళ్యాణ మండపం, పురోహితులు ఖర్చులు అందజేశారు. సామాజిక ప్రజా సేవకురాలు ఇందు ప్రియాల్ అంగన్వాడి టీచర్ మహమ్మద్ సుల్తాన ఉమర్ వాషింగ్ మిషన్ అందజేశారు.ఎంబరి రామచంద్రం  బంగారు ఉంగరం అందజేశారు. గజ్వేల్ చెలిమి ఫౌండేషన్ వారు వంట పాత్రలు, బడి బాసన్లు అందజేశారు. ఆపన్న హస్తం గజ్వేల్ వారు బెడ్ మంచలు, బీరువా, మరికొన్ని వంట పాత్రలు అందజేశారు.అలాగే సిద్దిపేటకు చెందిన స్వప్న భోజన కిరాణా సామాగ్రి అందజేశారు. వర్ష వెండి ఆభరణాలు, పెళ్లి బట్టలు అందజేశారు. వీరితోపాటు అనేకమంది దాతలు వీరి వివాహానికి సహకరించి వారికి తోచిన సహాయం అందజేశారు.వీరందరి సహకారంతో మౌనిక నర్సింహుల వివాహం అంగరంగ వైభవంగా నాచారం లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో నిర్వహించడం జరిగింది. నూతన వధూవరులను ఆశీర్వదించడానికి ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి రాంగోపాల్ రెడ్డి, బాలల సంక్షేమ సమితి సభ్యులు దేశబోయిన నర్సింలు, అంజమ్మ, మంజుల, బాల రక్ష భవన్ కో-ఆర్డినేటర్ మమత,డిసిపిఓ రాము, సిడిపిఓ వెంకట రాజమ్మ,బాలల పరిరక్షణ అధికారులు బూరుగుపల్లి రాజు, రమేష్, రాజు, మహేష్, నాగరాజు, నర్సింలు, సామాజిక ప్రజాసేవకులు మహమ్మద్ సుల్తాన ఉమర్,ఏఏంసి డైరెక్టర్ శీలసారం ప్రవీణ్, ఐసిడిఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7