ప్రకటనలు

ఈవిఎంల మొదటి రాండమైజేషన్ పూర్తి

135 Views

త్వరలో జరిగే శాసన సభ ఎన్నికలకు సంబంధించి మొదటి రాండమైజేషన్ ప్రక్రియ పూర్తి అయినదని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.

శుక్రవారం ఐ డి ఓ సి వీడియో ఎన్ ఐ సి హల్ నందు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిదుల సమక్షంలో ఎన్నికలకు సంబంధించిన స్ట్రాంగు రూమ్ నందు ఉనటువంటి కంట్రోల్ యూనిట్లు, బ్యాలట్ యూనిట్లు , వివి ప్యాట్ల రాండమైజేషన్ మొదటి రాండమైజేషన్ నిర్వహించారు.

ప్రక్రియ పూర్తి చేసి స్క్రీన్ ద్వారా చూపించారు.

వారి సమక్షంలో మొదటి రాండమైజేషన్ ప్రక్రియ ప్రక్రియ పూర్తి చేసిన వేములవాడ , సిరిసిల్ల నియోజక వర్గాలకు కేటాయించిన కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వివి ప్యాట్ ల జాబితా రాజకీయ పార్టీ ప్రతినిధులకు అందజేశారు.

కేంద్ర ఎన్నికల మార్గదర్శకాలు, నిబంధనలను అనుసరిస్తూ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా రాజకీయ పార్టీ ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ కోరారు.

సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్, ఆర్డీఓ లు ఆనంద్ కుమార్, మధు సూదన్, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *