సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేయాలని, సజావుగా ధాన్యం సేకరణ పూర్తి చేసేలా చూడాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు.
శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ ఎన్. ఖీమ్యా నాయక్ తో కలిసి ధాన్యం కొనుగోలుపై సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 258 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 3 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. 87 లక్షల గన్నీ బ్యాగుల అవసరం ఉంటుందని అన్నారు. 6 వేల 634 టార్పాలిన్లు, 632 పాడీ క్లీనర్ లు, 620 తేమ కొలిచే మెషీన్ లు, 816 ఎలక్ట్రానిక్ తూకం మెషీన్ లు అందుబాటులో ఉన్నాయని వివరించారు.




