సిరిసిల్లలో జరిగే కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను అడ్డుకుంటామని తెల్లవారుజామున 6 గంటలకు టీఎన్ఎస్ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు మోతె రాజిరెడ్డిని సిరిసిల్లలోని వారి నివాసంలో పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది.
ఈ సందర్భంగా మోతె రాజిరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతమనే భయంతో ముందస్తు అరెస్టులు చేస్తూ ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తున్నారని కేసీఆర్ ప్రభుత్వంలో వారి కుటుంబాలకు తప్ప రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగలేదని విద్యార్థులను,నిరుద్యోగులను మోసం చేసిన ఘనత కేసీఆర్ కె దక్కుతుందని,రానున్న ఎన్నికల్లో కేసీఆర్ కి తగిన గుణపాఠం ప్రజలే చెబుతారని హెచ్చరించారు.
మొన్న విడుదల చేసిన మ్యానిఫెస్టోలో విద్యార్థులగురించి కానీ నిరుద్యోగ భృతి,ఉద్యోగ కల్పన గురించి ప్రస్తావించక పోవడం సిగ్గుచేటని ఎద్దేవాచేశారు.జరగబోయే ఎన్నికల్లో ప్రజలు,విద్యార్థులు,నిరుద్యోగులు కేసీఆర్ కి ఓటుతో బుద్ది చెప్పలని టీఎఎస్ఎఫ్ పక్షాన పిలుపునిచ్చారు..
