పార్లమెంటు సీట్లలో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు తీవ్ర అన్యాయం చేసిందని మందకృష్ణ మాదిగ అన్నారు.ఎమ్మార్పీఎస్ సిరిసిల్ల జిల్లా మూక్యకార్యకర్తల సమావేశంలో ఈ సందర్భంగా మాంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ..పార్లమెంట్ సీట్లలో తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలకు మూడు సీట్లు ఉంటే రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ద్రోహం చేసిందని, రేవంత్ రెడ్డి మాలలకు భయపడి తన ముఖ్యమంత్రి సీటును కాపాడుకోవడం కోసం మాలల మాట వింటూ మాదిగలకు అన్యాయం చేస్తున్నాడని అన్నారు.దళితుల్లో 20% గళ్ళ మాలలకు రెండు సీట్లు కేటాయించి ఊరుకొక్కరు లేని బైండ్ల కులానికి ఒక సీటు ఇచ్చిన రేవంత్ రెడ్డి దళితుల్లో 75% గల మాదిగలకు ఒక్క సీటు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ లో ఐదు శాతం జనాభా కలిగిన తమ రెడ్డి కులానికి ఆరు సీట్లను కేటాయించుకున్న రేవంత్ రెడ్డి 12 శాతం జనాభా గల మాదిగలకు ఒక్క సీటు ఇవ్వకుండా ద్రోహం చేశాడని అన్నారు.మాదిగల మద్దతుతోనే నేను ఈ స్థాయికి ఎదిగిన అని,నా సొంత కులం నన్ను పట్టించుకోకపోయినా మాదిగలు మాత్రం నా ప్రతి ఎదుగుదలలో వెన్నంట ఉన్నరని అనేక వేదికల మీద మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మాదిగలకు అవకాశాలను ఇవ్వకుండా అవమాన పరుస్తూ నమ్మకద్రోహానికి పాల్పడ్డాడని అన్నారు. మాదిగలకు ద్రోహం చేసిన పార్టీలన్నీటిని భూస్థాపితం చేశామని కాంగ్రెస్ పార్టీకి కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఓడించడం కోసం మాదిగలమంతా ఏకమవుతామని అన్నారు.ఒక్క సీటు కూడా కేటాయించని కాంగ్రెస్ పార్టీని ఒడిద్దాం మాదిగలంతా BJP పార్టీకి ఓటేసి గిలిపించుకుందాం అన్నారు.
ఈ కార్యక్రమంలో MRPS జిల్లా ఇంచార్జి ఇంజం వెంకటస్వామి మాదిగ, బెజ్జంకి అనిల్ మాదిగ MRPS కరీంనగర్ జిల్లా అధ్యక్షులు, కనాపూర్ లక్ష్మణ్ మాదిగ MSP సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు, ఎలాగందుల బిక్షపతి మాదిగ MRPS సిరిసిల్ల జిల్లా కన్వీనర్
రాష్ట్ర నాయకులు ఆవునూరు ప్రభాకర్ మాదిగ గుండా థామస్ మాదిగ గుండ్రెడ్డి రాజు మాదిగ బొల్లారం చంద్రమౌళి మాదిగ నేరెళ్ల శ్రీనివాస్ మాదిగ బేస్ కుమార్ మాదిగ కమలాకర్ మాదిగశంకర్ మాదిగ రాకేష్ మాదిగమరియు సీనియర్ నాయకులు వివిధ మండల అధ్యక్షులు పాల్గొన్నారు
