శ్రీ చైతన్య పాఠశాల రక్తదాన శిబిరం శ్రీ చైతన్య పాఠశాల కొంపల్లి-5 వ బ్రాంచ్లో
Your message has been sent
ఏజీఎం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జనని బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేశారు .శ్రీ చైతన్య పాఠశాలల చైర్ పర్సన్ శ్రీమతి ఝాన్సీ లక్ష్మీ బాయి జన్మదినాన్ని పురస్కరించుకొని, మన సమాజంలో సేవా భావం పెంపొందించడంతో పాటు ప్రాణ దానంతో సమానమైన రక్తదానం ప్రాముఖ్యతను తెలియజేయడం ఒక లక్ష్యంగా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. శ్రీమతి ఝాన్సీ లక్ష్మీబాయి గారు విద్యారంగంలోనే కాకుండా సామాజిక సేవలో కూడా అపారమైన సేవలు అందించారు ఈ రక్తదాన శిబిరం కూడా శ్రీ చైతన్య పాఠశాలల యొక్క సామాజిక బాధ్యత అంకురార్పణగా నిలిచేటట్టు చేసింది. శ్రీ చైతన్య పాఠశాలలు ఎప్పుడూ విద్యతో పాటు మానవతా విలువలను,నైతిక విలువలను కూడా పెంపొందించడం తన కర్తవ్యం గా భావిస్తున్నది అని జోన్ ఎజిఎం కె.శ్రీనివాసరావు అన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యంగా 64 మంది రక్తదానం చేసారు. ఈ కార్యక్రమంలో కొంపల్లి జోన్ ఏజీఎం కే శ్రీనివాసరావు మరియు జివి రమణ రావు, పాఠశాల ప్రిన్సిపల్స్ నాగమణి మరియు చందు, హై స్కూల్ కోఆర్డినేటర్ రవి మరియు ప్రైమరీ కోఆర్డినేటర్ అన్నపూర్ణ, డీన్ గోవింద్, ఐపీఎల్ ఇన్చార్జి సీతారాం, ఎం పి ఎల్ ఇంచార్జి సందీప్, ఐకాన్ ఇన్చార్జి రాములు, సి బ్యాచ్ ఇన్చార్జి బాలరాజు, ప్రైమరీ ఇన్చార్జి వాసవి, ప్రీ ప్రైమరీ ఇన్చార్జి విజయ, జోనల్ పిఈటి హేమంత్, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు మరియు హాస్టల్ వార్డెన్లు ఇన్చార్జీలు పాల్గొని రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.






