దౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ కేజీబీవి తో పాటు గాజులపల్లి, లింగరాజు పల్లి, శేరి పల్లి బందారం, ఇందుప్రియాల్, సూరంపల్లి, దొమ్మాట, తిరుమలాపూర్ తదితర పాఠశాలల్లో బతుకమ్మ సంబురాలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి నర్సవ్వ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి నిదర్శనం బతుకమ్మ పండగ అని ఆడబిడ్డలకు అతి పెద్ద పండుగ పాఠశాల దశలోనే పిల్లలకు మన రాష్ట్ర పండుగలు గురించి పూర్తి అవగాహన ఉండాలని మన సంస్కృతి గురించి విద్యార్థులకు సంపూర్ణంగా తెలియాలనే ఉద్దేశంతోనే పాఠశాల స్థాయిలో నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
