(తిమ్మాపూర్ అక్టోబర్ 12)
మానకొండూరు నియోజకవర్గంలోని తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామం బూత్ నెంబర్ 166 లో కాంగ్రెస్ పార్టి గ్రామ శాఖ అధ్యక్షుడు పింగిలి కిష్టారెడ్డి అధ్వర్యంలో జిల్లా కార్యదర్శి మామిడి అనిల్ కుమార్ సమక్షంలో గురువారం గడపగడపకి గ్యారెంటీ కార్డుల పంపిణి కార్యక్రమం చేపట్టారు.కార్డులో పొందపరచిన ఆరు గ్యారంటీలను ప్రజలకు ఆయన వివరించారు.ఈ ఆరు గ్యారెంటీలతో ప్రతి కుటుంబంలో వెలుగు నిండుతాయని తప్పకుండా ప్రతి ఒక్కరు చేతి గుర్తుకు ఓటు వేసి, మానకొండూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కవంపల్లి సత్యనారాయణ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి జంగా రామకృష్ణారెడ్డి గొలపల్లి బూత్ అధ్యక్షులు మల్లెత్తుల తిరుపతి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వేల్పుల మధు, బీసీసెల్ అధ్యక్షులు గడ్డ మహేందర్, కాల్వ మహేష్, కాల్వ దమ్మయ్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు