దౌల్తాబాద్: మండలానికి చెందిన గొర్రెల పెంపకందారులు గురువారం గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పోచబోయిన శ్రీహరి ఆధ్వర్యంలో మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిని కలిశారు. తాము గొర్రెల యూనిట్ల కోసం గతంలోనే డీడీలు కట్టామని, తమకు వెంటనే గొర్రెల యూనిట్లు ఇప్పించాలని ఎంపీకి విన్నవించారు. ఎంపీ వెంటనే ఉన్నతాధికారులకు ఫోన్ చేసి ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే డీడీలు కట్టినందున వీరికి గొర్రెల యూనిట్లు అందజేసేలా కృషి చేయాలని కోరారు. ఎంపీని కలిసిన వారిలో బొట్క సత్యంయాదవ్, గొల్ల రాజశేఖర్‌యాదవ్, నరేష్‌యాదవ్, సత్యం యాదవ్ తదితరులు ఉన్నారు.
