ములుగు అక్టోబర్ 10 :జాతీయ స్కాలర్షిప్ కు ఇద్దరు విద్యార్థులు ఎంపిక హర్షనీయం…
గజ్వేల్ నియోజకవర్గం ములుగు గ్రామం, మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండీ జాతీయ స్కాలర్షిప్ కు ఇద్దరు విద్యార్థులు ఎంపిక హర్షనీయం.
భారత మానవాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతి యేటా ఇస్తున్నటువంటి జాతీయ స్కాలర్షిప్ పురస్కారానికి, ములుగు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ఇద్దరు విద్యార్థులు ఎంపిక కావడం పట్ల ములుగు కళాశాల ప్రిన్సిపల్ బుచ్చిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
బైపిసి విభాగం నుంచి అమిత్ పదనిస 948 మార్కులు, ఎంపీసీ విభాగం నుంచి దొంతు ప్రకాష్ 945 మార్కులు సాధించి జాతీయ స్కాలర్షిప్ పురస్కారానికి ఎంపిక కావడం అభినందనీయమని ఈ స్కాలర్షిప్ కి ఎంపిక కావడం పట్ల కళాశాల అధ్యాపక బృందం యొక్క కృషి ఎంతో ఉందని వారన్నారు. ఈ సందర్బంగా స్కాలర్షిప్ సాధించిన విద్యార్థులను అభినందిస్తూ, మిగతా విద్యార్థులు బాగా చదివి ఇలాంటి స్కాలర్షిప్లు అందుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.