Breaking News

లబోదిబోమంటున్న అరుతడి పంటలు సాగుచేసిన రైతు

123 Views

ఎల్లారెడ్డిపేట:తెలుగు న్యూస్ 24/7 పిబ్రవరి 10 :
రైతులు వరి పంట సాగుచేయవద్దనీ అరుతడి పంటలే సాగుచేసుకోవాలనీ ఓకవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, మరోవైపు ప్రభుత్వ యంత్రాంగం విశృతమైన ప్రచారం కల్పించింది
అయినప్పటికీ ఎల్లారెడ్డిపేట మండలంలో సమృద్ధిగా వాటర్ ఉన్నప్పటికీ 75 శాతం మంది రైతులు ఓకరిని చూసి ఓకరు వరి పంట ఇప్పటివరకు సాగుచేస్తునే ఉన్నారు ,
25 శాతం మంది రైతులు మాత్రం అరుతడి పంటలు సాగుచేసుకున్నారు ,
మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాటామీద తాను తన కున్న మొత్తం ఆరు ఎకరాల వ్యవసాయ భూమి లోనీ మూడు ఎకరాల భూమిలో ముప్పై వేల రూపాయలు ఖర్చు చేసి యశోద సీడ్స్ కంపెనీ కి చెందిన హైబ్రిడ్ నువ్వుల పంట సాగు చేయగా అది మొలకెత్తలేదని అల్మాస్ పూర్ గ్రామానికి చెందిన కుమ్మరి కులానికి చెందిన శనిగరం లక్ష్మీ రాజం అనే రైతు లబోదిబోమంటున్నారు , మళ్ళీ దుక్కిదున్నీ నువ్వు పంట అలికాననీ అదే విధంగా రెండు ఎకరాల వ్యవసాయ భూమిలో సోనమ్ సీడ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ వారి సోనమ్ – 234 హైబ్రిడ్ రకం మక్క పంట సాగుచేసి ఇరువై వేల రూపాయలు ఖర్చు చేసుకోగా మెగిపురుగు సోకి మక్క పంట సర్వనాశనం అయ్యిందనీ ,అదే విధంగా ఎకరంలో సాగుచేసి హైబ్రిడ్ పెసర పంట పది వేల రూపాయలు ఖర్చు చేసి సాగుచేయగా అది చేతుకు వస్తుందో రాదో తెలియని పరిస్థితి ఉందని ఆయన ఆవేధన వ్యక్తం చేశారు ,
తాను ముఖ్యమంత్రి కెసిఆర్ మాటామీద వరి పంట వదిలి పెట్టి పంట మార్పిడి పద్దతిపై అరుతడి పంటలు సాగు చేస్తే ఇన్నది పాయో ఉంచుకున్నది పాయే అన్న చందంగా నా పరిస్థితి ఉందని రైతు శనిగరం లక్ష్మీ రాజం అంటున్నారు ,
మా అల్మాస్ పూర్ గ్రామంలో సాగు చేసుకున్న రైతుల వరి పంట మాత్రం ప్రస్తుతం ఆశాజనకంగానే ఉందని లక్ష్మీ రాజం తెలిపారు ,
ఇప్పటికైన రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వమైన కేంద్రంలోనీ మోడీ ప్రభుత్వమైన రైతులపై ఈ పంట వేయాలి ,
ఆ పంట వేయాలనే ఆంక్షలను విధించవద్దనీ రైతులు కోరుతున్నారు,
స్వాతంత్ర్య భారతదేశం లో ఇప్పటివరకు ఈ పంట వేయాలి ఆ పంట వేయాలనీ రైతులపై ఆంక్షలను విదించినవారు అంటు లేరు ,
ఇది రాజకీయ నాయకులు గుర్తేరిగి మసులు కోవల్సిన అవసరం ఎంతైన ఉంది‌ , రైతులను ఇబ్బందులకు గురిచేయవలసిన అవసరం కూడా లేదన్నారు ,

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7