ముస్తాబాద్, అక్టోబర్10, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా కొండాపూర్ గ్రామానికీ చెందిన క్యారం రాజు, అలాగే నామాపూర్ గ్రామానికీ చెందిన తాడేపూ కొమురయ్య, ప్రధాన కార్యదర్శిగా కొండాపూర్ గ్రామానికీ చెందిన వంగ మోహన్ రెడ్డి, కార్యదర్శిగా మోహినికుంట గ్రామానికీ చెందిన శీలం రాజనర్సు, బిసిసెల్ మండల ఉపాధ్యక్షులుగా పోతుగల్ గ్రామానికి చెందిన ఈర్ల రాజలింగం లను నియమించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రతి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ తలపెట్టిన 6, గ్యారంటీసంక్షేమ పథకాలతో పాటు ప్రతి గడపగడపకు ప్రజల్లోకి తీసుకెళుతున్న అనేకమైన పథకాలను వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇస్తామన్న పథకాలను అమలు చేస్తామని ఏకకాలంలో 2, లక్షలు ఋణమాఫీనీ ప్రమాణ స్వీకారం చేసిన మరో క్షణమే సంతకంచేసే విధంగా సంక్షేమ పథకాలు కూడా అమల్లోకి తెస్తామని సోనియమ్మ రాహుల్ గాంధీ మాట తప్పరని అన్నారు.
