3గంటలుగా సిట్ ప్రారంభంనే చంద్రబాబు_
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు దాదాపు 3గంటలుగా సిట్ కోసం ఉన్నారు. నంద్యాల నుంచి రోడ్డు మార్గంలో సాయంత్రం 5గంటలకు కుంచనపల్లిలోని సిట్ కార్యాలయానికి చంద్రబాబును తీసుకొచ్చారు. అప్పటి నుంచి చంద్రబాబును.. ఆయన తరఫు న్యాయవాదులను కూడా కలవనీయకుండా సీఐడీ అధికారులు అడ్డుకున్నారు. న్యాయసహాయం కోసం లాయర్లను కలిసేందుకు అనుమతివ్వాలని చంద్రబాబు స్వయంగా లేఖ రాసినా సీఐడీ అధికారులు స్పందించలేదు. మరో వైపు భువనేశ్వరి, నారా లోకేశ్‌ను కూడా చంద్రబాబును కలిసేందుకు సీఐడీ అధికారులు అనుమతించలేదు. చంద్రబాబు సిట్‌లో ఐదో అంతస్తులో ఉంటే వీరిని నాలుగో అంతస్తులో కూర్చోబెట్టారు.
దీంతో సీఐడీ అధికారుల తీరుపై తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును ఏసీబీ కోర్టులో హాజరుపరిచామని అధికారులు సీఐడీ హాజరై కూర్చోబెట్టి తాత్సారం చేయడంపై మండిపడుతున్నారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. తెదేపా ఆందోళనతో కుంచనపల్లిలోని సిట్ కార్యాలయంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనకారులు సిట్ కార్యాలయం వద్దకు రాకుండా భారీగా పోలీసులు మోహరించారు. చంద్రబాబుకు ఎప్పుడు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు?ఎప్పుడు కోర్టులో హాజరుపరుస్తారోనని తెదేపా శ్రేణులు ఎదురు చూస్తున్నారు. ఏసీబీ కోర్టులో చంద్రబాబు వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టు వద్ద సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలో ఆధారాలు చూపించకుండా నేరుగా కోర్టులోనే తేల్చుకోవాలని చెప్పిన సీఐడీ అధికారులు వ్యూహం మార్చుకున్నారా?అని తెదేపా నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.





