రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఎలాంటి సమాచారం లేకుండా విద్యుత్ కోతకు గురవుతుందని స్థానికులు అన్నారు. మండల కేంద్రంతో పాటు చుట్టుపక్క గ్రామాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి సమాచారం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు సమయం సందర్భం లేకుండా సెస్ సిబ్బంది విద్యుత్ని తొలగిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇట్టి విషయాన్ని లైన్మెన్ లక్ష్మణ్ వివరణ కోరగా మాకు ఎలాంటి సమాచారం లేకుండా పై అధికారులు విద్యుత్ తొలగిస్తున్నారని అన్నారు.
